రాయిలపూర్ నుండి శ్రీరంగావరం కుమ్మరిగడ్డకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తప్పరి మధు (26) సోమవారం మృతి చెందాడు. రోడ్డులో క్రషర్ మిషన్ వాహనాల కంకర వల్ల వాహనం జారిపడి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు క్రషర్ మిషన్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల నిండు ప్రాణం బలైందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.