సూరారం బాలిక కిడ్నాప్ హత్య కేసును పోలీసులు చేధించారు. సూరారంలో బాలికను కిడ్నాప్ చేసి తిరుపతి హత్య చేశాడు. బాలిక తల్లిని అనుభవించాలన్న కోరికతో బాలికను హత్య చేశాడట. బాలిక తల్లి కోసం ముగ్గురిని చంపేందుకు ప్లాన్ చేశాడు. ముందుగా ఏడేళ్ల బాలికను హత్య చేసి తర్వాత మరో పాపను హత్య చేయాలని తిరుపతి ప్లాన్ చేశాడు. బాలిక తల్లి సహజీవనం చేస్తున్న ప్రభాకర్ని కూడా చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ తరుణంలోనే ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి గొంతు కోసి మృతదేహాన్ని గోన సంచిలో కుక్కి పారిపోయాడు తిరుపతి.