ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైతు రుణమాఫీ గురించి 24 గంటల ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను అని బ్యాంకుల చుట్టూ తిప్పి రోడ్లపాలు చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హైడ్రా అనే కొత్త హైడ్రామాని తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొన్నారు.