ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం. ఫార్ములా-ఈ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పింది. దీంతో కేటీఆర్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరఫు లాయర్ చెప్పారు. కాగా ఫార్ములా-ఈ కారు రేసులో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.