ఇంటర్ బోర్డును జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు సోమవారం ముట్టడించారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్థర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇంటర్ బోర్డు పంపిన ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.