మల్లేపల్లి డివిజన్ వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని బడి మసీదు వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రూ. 50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తి అయితే స్థానికంగా ట్రాపిక్ సమస్యలు ఉండవన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు సహకరించాలని కోరారు.