ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్లు, ఆటవి భూముల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి తదితర సమస్యలపై వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.