వివేకానంద నగర్ లో అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు

57చూసినవారు
మెహిదీపట్నం డివిజన్ లోని వివేకానంద నగర్ కాలనీలో రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేశారు. భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు గుంతలమయంగా మారింది. డ్రైనేజీ, వాటర్ పైపు లైన్ ఓవర్ స్లోతో గుంతలలో నీరు నిలిచి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ప్రమాదాలు కూడా జరిగి పలువురు వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయని కాలనీవాసులు శుక్రవారం తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభించిన రోడ్డు పనులను నేటికీ పూర్తి చేయకపోవడంతో అసహన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్