వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అరెస్ట్ చేయాలని శనివారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినా పోలీసులు అతన్ని అరెస్ట్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.