హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మంగళవారం సాయంత్రం నాంపల్లి, లక్డికాపూల్, అసెంబ్లీ, హిమాయత్ నగర్, బషీర్బాగ్ తో పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్లు అన్ని జలమయం అవ్వడంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది.