కాంగ్రెస్ లోకి వెంకటేష్ ఇంద్రపల్లి
తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి శుక్రవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ దేశంలో ప్రజా సౌమ్యాన్ని కాపాడటం కోసం చేస్తున్న పనుల్లో పాల్గొంటూ, దోచుకోబడ్డ తెలంగాణను పునర్ నిర్మించడానికి సీఎం రేవంత్ చేస్తున్న కృషికి తోడుగా ఉంటానని వెంకటేష్ ఇంద్రపల్లి తెలిపారు.