సిఐ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి డిఎస్పీ

74చూసినవారు
బాలనగర్ డిసిపి పరిదిలోని సురారం పోలీస్ స్టేషన్ పై ఎసిబి అధికారులు దాడి చేశారు. రత్నాకర్ సాయిరాజ్ అనే వ్యక్తి పై గాజులరామరంలో గల ఓ భూ తగదా విషయంలో సురారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సాయిరాజ్ అనే భాదితుడికి సిఐ వెంకటేశం పలుమార్లు ఫోన్ చేసి నీపై పీడియాక్ట్ కేసు నమోదు చేస్తానని 5లక్షల రుపాయలు ఇస్తే ఈ కేసు నుండి రిమూవ్ చేస్తానని చెప్పడంతో భాదితుడు సిఐతో 3లక్షలకు భేరం కుదుర్చుకుని ఇప్పటికే 2లక్షల రుపాయలు ఇచ్చాడని, మిగతా 1లక్ష ఇస్తుండగా ఈరోజు సురారం సిఐని వలపన్ని పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్పి ఆనంద్ కుమార్ మీడియా కు తెలిపారు.

ట్యాగ్స్ :