'హైడ్రా' కూల్చివేతలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'హైడ్రాకు చట్టబద్ధత లేదు. CCMB, GHMCతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, నెక్లెస్ రోడ్డు చెరువుల FTL పరిధిలోనే ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా?' అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబి ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉంది అది కూల్చేస్తారా? అని నిలదీశారు.