కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ మరోసారి లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం రాంచీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.చిరాగ్ ఎల్జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగుతారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.