చెన్నూరు ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి: చెన్నయ్య

57చూసినవారు
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బంజారాహిల్స్ లో మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు అండగా ఉండే వివేక్ కి మంత్రి పదవి ఇస్తే ఆ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. మాల మహానాడు సహా 15 దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్