కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపియల్ సర్కిల్ లో ఏబివిపి ఆద్వర్యంలో రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి 300మంది విద్యార్థులతో మహదర్నా గురువారం నిర్వహించారు. ప్రభుత్వం ఎర్పడ్డనుండి 48మంది విద్యార్థుల చావు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వారు అన్నారు. సిగ్గులేని మంత్రుల తొత్తులకు కాంట్రాక్ట్ లు కట్టబెట్టడం వల్లే వరుస ఫుడ్ పాయిజన్ లకు కారణమవుతుందని విమర్శించారు.