అడ్డగుట్టలో అర్ధాంతరంగా నిలిపివేసిన మల్టీపర్పస్ కమిటీ హాల్ను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం పార్టీ సికింద్రాబాద్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని కమిటీ హాల్ వద్ద నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.