మధుర నగర్ లోని కమ్యూనిటీ హాల్ మూడవ అంతస్తు పనులను బుధవారం కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. శుభకార్యాలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నవారికి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ నాయకులు శైలందర్ తదితరులు పాల్గొన్నారు.