కంటోన్మెంట్ బోయినపల్లి బాపూజీ నగర్ బస్తీలో మంగళవారం కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భాను ప్రకాష్, బాపూజీ నగర్ చైతన్య స్నేహితుల సంఘం పవన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా చిన్నారులకు పతంగులు పంపిణీ చేసారు. ముఖ్య అతిథిగా బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హాజరై చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. అదే విధంగా మిఠాయిలు పంచిపెట్టారు.