జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడి నకిలీ ఆర్సీలతో విక్రయిస్తున్న ముఠాను బోయిన్ పల్లి పోలీసులు గుట్టు రట్టు చేశారు. నగరానికి చెందిన రజాక్ ఖాన్, యమ్మల యోహాను అరెస్ట్ చేసి రూ. 8లక్షల విలువైన 14ద్విచక్ర వాహనాలు 4 నకిలీ ఆర్సీలు స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండ్ కు తరలించినట్లు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.