వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కార్పోరేటర్

72చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షానికి మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్, రెజిమెంటల్ బజార్ లో మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ప్రాంతాలను డివిజన్ కార్పొరేటర్ దీపిక పరిశీలించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కార్పోరేటర్ ను స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్