హైదరాబాద్, జలాశయాలతో పాటు చెట్ల పరిరక్షణ పై హైడ్రా దృష్టి సారించింది.ఈ మేరకు జీహెచ్ఎంసీ, హైడ్రా, అటవీ విభాగాలతో జోన్లవారీగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో చెట్ల స్థితిపై సర్వే చేసేందుకు సిద్ధమైంది. బుధవారం హైడ్రా కమిషనర్ జీహెచ్ఎంసీ, హైడ్రా, అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యల పై సమీక్షించిన ఆయన ట్రీ ప్లాంటేషన్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.