నూతన ఆలయ కమిటీ ఎన్నిక ప్రమాణస్వీకారం

55చూసినవారు
నూతన ఆలయ కమిటీ ఎన్నిక ప్రమాణస్వీకారం
మల్లాపూర్ గోకుల్ నగర్ లో కొలువైన శ్రీ శ్రీ శ్రీ మాతా జగజ్జననీ మగురమ్మల దేవాలయం నూతన కమిటీ సభ్యులచే సోమవారం కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు టి. మల్కయ్య, కోశాధికారి మాటూరి శ్రీరంగ లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధిలో నూతన కమిటీ ముందుండాలని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సంక్షేమ సంఘం నాయకులు నూతన కమిటీకి సూచించారు. భక్తుల సంఖ్య పెంచే దిశగా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్