రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇటీవల నమోదైన కొన్ని కేసుల్లో సత్వరమే స్పందించి నేరస్తులను పట్టుకోని బాధితులకు న్యాయం చేశారు. సదరు పోలీస్ అధికారులను, సిబ్బందిని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం నేరెడ్ మేట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రశంస పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. నెర పరిశోధన దర్యాప్తులో పాల్గొనే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు.