ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్ లో ఓ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పలువురు వృద్దులకు ఉచిత కళ్ళద్దాలు, మందులు పంపిణీ చేశారు.