వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎబ్బనూర్ లో పండగ పూట విషాదచాయలు అలముకున్నాయి. ఏబ్బనూర్ గ్రామానికి చెందిన గోధుమగడ్డ నారాయణ శనివారం పని నిమిత్తం వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం లింగంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.