ఉమ్మడి గండీడ్ మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా సోషల్ ఆడిట్ కొనసాగుతుంది. మొదటి విడతగా సోమవారం పలు గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సంబంధించి కూలీలకు పని కల్పించిన పని దినాలకు పలు వివరాలపై ఆడిట్ కొనసాగించనున్నారు. ఈ మేరకు గ్రామాల్లో అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు.