ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ కు వెళ్ళే దారిలో థియేటర్ ఎదురుగా రోడ్డు పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుపై గుంతలు ఏర్పడి అందులో మురుగు నీరు నిలిచిపోయింది. మురుగు నీటి వల్ల వాహనదారులు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయిందని ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు బాగు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.