

అద్వానంగా మారిన గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్
గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ పరిసరాల్లో అపరిశుభ్రత అద్వానంగా తయారైంది. స్థానిక వ్యాపారస్తులతో పాటు ఇక్కడికి వచ్చే వారు చెత్తను మార్కెట్ భయట పడేస్తున్నారు. కూరగాయల వ్యర్థాలు కూడా భయట పడేస్తుండడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంతో మార్కెట్ కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సోమవారం పలువురు కోరుతున్నారు.