
యాకుత్ పురా: షాపింగ్ కు వెళ్లిన వివాహిత అదృశ్యం
ఓ వివాహిత అదృశ్యమైన ఘటనలో పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. చాంద్రాయణగుట్ట కు చెందిన ముస్కాన్ బేగం(20) సోమవారం సాయంత్రం చార్మినార్ వద్దకు షాపింగ్ నిమిత్తం తన భర్త, సోదరితో కలిసి వెళ్ళింది. లాడ్ బజార్ లో షాపింగ్ చేస్తుండగా మస్కాన్ బేగం అదృశ్యమైంది. చుట్టూ పక్కల ఎంత వెతికిన ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. భర్త, సోదరి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.