ఆకాశంలో ఉన్న విమానం డోర్ తీసేందుకు యత్నించిన హైదరాబాదీ

63చూసినవారు
ఆకాశంలో ఉన్న విమానం డోర్ తీసేందుకు యత్నించిన హైదరాబాదీ
ఆకాశంలో ఉన్న విమానం డోర్ తీసేందుకు ఓ వ్యక్తి యత్నించడంతో తోటి ప్రయాణికులంతా షాక్‌కు గురయ్యారు. హైదరాబాద్ గాజులరామారం ఏరియాకు చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న క్రమంలో విమానం ఆకాశంలో ఉండగానే తలుపు తీసేందుకు యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది భద్రతాధికారులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు సీఆర్పీసీ 41 కింద అనిల్‌పై కేసు నమోదు చేసి తమ అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్