ఎవరెస్ట్ ఎత్తు ఎంతంటే?

80చూసినవారు
ఎవరెస్ట్ ఎత్తు ఎంతంటే?
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఈ పర్వతం సముద్ర మట్టం నుంచి సుమారు 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్ ఎడ్మండ్ హిల్లరీలు అధిరోహించారు. చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిఖరాన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్‌మాత’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 800 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారట.

సంబంధిత పోస్ట్