సోషల్ మీడియాలో దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొన్ని పులులు జింకను వేటాడి తింటుండగా.. కొన్ని హైనాలు గమనిస్తాయి. జింక మాంసాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించగా.. దీంతో వాటికి దక్కకుండా పులులు జింక మాంసాన్ని చెట్టుపైకి తీసుకెళ్తాయి. దీంతో హైనాలన్నీ చెట్టు చుట్టూ పొంచి ఉంటాయి. చివరికి పులి అక్కడి నుంచి పారిపోతుంది.