తమిళనాడులోని తలైవాసల్ కు చెందిన నిత్య రాధాకృష్ణన్ ఐటీ ఉద్యోగి. ఆమె బాల్యంలో తల్లి పట్టుదలతో చదివి ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. తల్లి స్పూర్తితో నిత్య పెళ్లై బాబు పుట్టాక సివిల్స్ రాసి ఎంపికైంది. శిక్షణలో సత్తాచాటి అవుట్‌డోర్ ట్రైనింగ్‌లో ‘బెస్ట్ లేడీ ప్రొబెషనర్’గా ట్రోఫీ తీసుకుంది. ట్రాన్స్ జెండర్స్, వేశ్యా వృత్తుల్లో ఉన్నవారికి చట్టపూర్వకంగా చేయూతనందించమే తన ధ్యేయమని నిత్య పేర్కొంది.