‘తంగలాన్‌’ ప్రయాణాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను: మాళవిక మోహనన్‌

85చూసినవారు
‘తంగలాన్‌’ ప్రయాణాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను: మాళవిక మోహనన్‌
స్టార్‌ హీరో విక్రమ్‌, హీరోయిన్ మాళవిక మోహనన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్‌’. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ హీరోయిన్ మాళవిక మీడియాతో మాట్లాడారు. ‘తంగలాన్‌’ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని, ఈ ప్రయాణాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఆగస్టు 30న బాలీవుడ్‌లో ఈ మూవీ రిలీజ్‌ కానున్నట్లు చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్