జమిలి బిల్లు.. జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధం: అమిత్ షా

82చూసినవారు
జమిలి బిల్లు.. జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధం: అమిత్ షా
జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. పార్లమెంట్ లో విపక్ష సభ్యుల నుంచి బిల్లుపై వ్యతిరేకత రావడంతో దీన్ని జేపీసీకి పంపిస్తామని చెప్పారు. ప్రధాని సైతం జేపీసీలో బిల్లుపై విస్తృత చర్చ జరగాలని సూచించారని పేర్కొన్నారు. సంయుక్త పార్లమెంట్ స్థాయీ సంఘం నివేదిక తర్వాత బిల్లును మళ్లీ తెస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్