AP: తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు చేసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. YCP గతంలో TDP నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించిందన్నారు. అందులో తాను కూడా బాధితుడినేనని అన్నారు. ఇప్పుడు తప్పు చేసినవారిపై కేసులు చేస్తే విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరో 6 నెలల్లో రాష్ట్రంలో అన్ని ఇళ్లకు తాగునీరు అందిస్తామని అన్నారు.