ఊసరవెల్లులు రాజ్యం నడిపితే తొండలు, ఉడతలు వస్తాయని మాజీమంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ హయాంలో రెప్పపాటు కూడా పోకుండా కరెంట్ సరఫరా చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజుకు ఎన్ని సార్లు కరెంట్ పోతుందో కూడా తెలువదని ఎద్దేవా చేశారు. ప్రజలు కరెంట్ బాధలతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులను అడిగితే.. మోటర్లలో తొండలు, ఉడతలు పోతున్నాయని చెప్తున్నారని మండిపడ్డారు. రైతులకు బోనస్ బోగస్ అయిందన్నారు.