చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యముంటే ఈ నెల రోజుల్లో జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేత పత్రాల్లో విషయమేమీ ఉండడం లేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం పెడుతున్న శ్వేతపత్రాలతో.. తమ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చబోమని చేయబోమని చెప్పినట్లు అనిపిస్తోందన్నారు.