బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తాజాగా ఆయన బాడీ గార్డ్‌ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికే బాడీగార్డులను హీరోలు ఏర్పాటు చేసుకుంటారని, ఎలాంటి హడావుడి లేకుండా వెళితే ఎవరూ పట్టించుకోరని అన్నారు. తనకు బాడీగార్డ్స్ ఉన్నారని, ప్రేక్షకులపై చేయి చేసుకోవద్దని ముందే చెబుతానని తెలిపారు. ప్రస్తుతం సోనూ నటిస్తున్న ‘ఫతేహ్’ మూవీ ఈనెల 10న విడుదల కానుంది.