వారిని విమర్శిస్తే ఇంటికొచ్చి కొడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి

71చూసినవారు
వారిని విమర్శిస్తే ఇంటికొచ్చి కొడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి
AP: తాను సీఎం చంద్రబాబు అంతా మంచివాడిని కాదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కోపతాపాలను పక్కన పెట్టారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి కొడతానంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్