మునగ ఆకులు జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. మునగాకులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. మునగాకు జుట్టుకు సహజంగా తేమను అందిస్తుందని నిపుణులు అంటున్నారు. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టును రాలకుండా తగ్గిస్తుంది. మునగాకు నుంచి తయారు చేసిన ఆయిల్ జుట్టుకు అప్లై చేస్తే చాలా మేలు చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.