తాతలతండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను పిత్రార్జితం అంటారు. తండ్రులు దాన్ని తాత హయాంలో పంచుకున్నా, తండ్రి హయాంలో పంచుకున్నా అంటే అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగి ఉంటే అప్పుడు దాన్ని పిత్రార్జితంగా భావించరు. పిత్రార్జిత ఆస్తిలో పిల్లలకు పుట్టుకతోనే భాగం వస్తుంది. హిందూ వారసత్వ చట్టం-2005లో సవరణ చేశారు. అంతకు ముందు కేవలం మగపిల్లలకు వారసత్వ హక్కు ఉండేది. 2005 తరువాత హిందూ కుటుంబంలో పుట్టిన ఆడ పిల్లలకూ వారసత్వ హక్కు వచ్చింది.