జీలకర్ర నీరు రోజూ తాగడం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ పటిష్టమౌతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. స్థూలకాయం కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఎప్పుడైతే నిద్ర తక్కువైందో వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే నిద్రలేమి సమస్య ఉండదు.