ఐరాస మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా బ్రిటన్‌కు చెందిన టామ్ ఫ్లెచర్‌ను సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నియమించారు. ఇంతకుముందు ఈ పదవిని మరో బ్రిటిష్ జాతీయుడు మార్టిన్ గ్రిఫిత్స్ నిర్వహించేవారు. ఆరోగ్య కారణాల వల్ల జూన్‌లో ఆయన తప్పుకోవడంతో, ఆ పదవిని తాత్కాలికంగా జాయిన్ ఎంసుయా నిర్వహిస్తున్నారు. ఫ్లెచర్ లాంఛనంగా పదవిని స్వీకరించేవరకు ఎంసుయా కొనసాగుతారు.