గోంగూర ఆకులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు దరిచేరకుండా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ పేషెంట్స్‌కి గోంగూర దివ్యౌషధంగా చెప్పొచ్చు. గోంగూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. బరువు తగ్గడం కోసం, మెరుగైన కంటి చూపు కోసం ప్రతీరోజూ గోంగూరను తీసుకోవాలి. అంతేకాదు బలమైన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.