అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే ఎత్తరాదన్నారు. ప్రధానంగా +371, +375, +381 వంటి కోడ్లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు కాపీచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.