సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు ఓ నది ఒడ్డున ఇసుకలో స్టంట్స్ చేయడానికి వెళ్లాడు. అయితే, అత్యుత్సాహానికి పోయి చేసిన విన్యాసం చివరకు బెడిసికొట్టింది. ఈ ఘటనతో అతడి స్నేహితులంతా షాక్ అయ్యారు. ఈ ప్రమాదం చూస్తుంటే అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.