భారత వాతావరణ విభాగం (IMD) బుధవారం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. రాబోయే తుఫాన్ హెచ్చరికలు అలాగే అసాధారణ వాతావరణ సూచనలను అందించడం కోసం 1875 జనవరి 15న దీనిని ఏర్పాటు చేశారు. IMD మన దేశానికి సేవలను అందించడమే కాకుండా నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా మారిషస్‌లకు దేశాలకు కూడా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తోంది.