అకౌంట్లోకి పొరపాటున జమ అయిన డబ్బు తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష

57చూసినవారు
అకౌంట్లోకి పొరపాటున జమ అయిన డబ్బు తిరిగి ఇవ్వనందుకు జైలు శిక్ష
తన అకౌంట్లో పొరబాటున జమైన డబ్బులు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ ఘటన సింగపూర్‌లో జరిగింది. భారత్‌కు చెందిన పెరియసామీ మథియాళగన్ (47) ఖాతాలోకి పొరపాటున వేరే ఖాతా నుంచి 25000 డాలర్లు (సుమారు రూ.16 లక్షలు) బదిలీ అయ్యాయి. అయితే, డబ్బులు పంపిన సంస్థ డైరెక్టర్ అతడిని డబ్బులు ఇవ్వాలని కోరాడు. అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం అతడికి 9 వారాల జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్